రాయల తెలుగు చరిత్ర
Posted by : హరి కుమార్ .పి
on 5:06 AM
తెలుగు
తెలుగు, భారత దేశము లోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని పక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలోని భాషలలో అత్యధికముగా మాట్లాడు భాషలు వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశము మాతృభాషలలో రె0డవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.
తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారము
తెలుగు | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | భారతదేశం | |
ప్రాంతం: | ఆంధ్ర ప్రదేశ్ (అధికార భాష) | |
మాట్లాడేవారి సంఖ్య: | 8.3కోట్లు (మాతృభాష), 9.32కోట్లు మొత్తం (రెండవ భాషగా మాట్లాడే ప్రజలతో సహా) | |
ర్యాంకు: | 13 (మాతృభాష) | |
భాషా కుటుంబము: | ద్రవిడ దక్షిణ-మధ్య తెలుగు | |
వ్రాసే పద్ధతి: | తెలుగు లిపి | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | ![]() | |
నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment